News April 14, 2025

గుమ్మడిదల : భార్యతో గొడవ పడి ఆత్మహత్య

image

భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బీర్ల నాగరాజు (30) కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అనితతో 15 నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో నాగరాజు మనస్తాపానికి గురై వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

Similar News

News April 17, 2025

పాడేరు: ‘తాగునీటి సమస్యలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు’

image

ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లూరి జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలు గురించి కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు. జేసీ అభిషేక్ పాల్గొన్నారు.

News April 17, 2025

బాపట్ల: ఆర్డీఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాధ్రపై సమీక్ష

image

బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య గురువారం ఆర్డీఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాధ్ర కార్యక్రమం పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి నెలలో జరిగే ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు, డిఎస్‌పీ మోయిన్, తహశీల్దార్ గోపి పాల్గొన్నారు.

News April 17, 2025

BREAKING: డీఎస్సీకి వయోపరిమితి పెంపు

image

AP: రాష్ట్రంలో డీఎస్సీ-2025కి వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గరిష్ఠ వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. కటాఫ్ తేదీని 2024 జులై 1గా నిర్ధారించింది. ఈ డీఎస్సీకి మాత్రమే వయోపరిమితి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

error: Content is protected !!