News April 14, 2025
IPL: చరిత్ర సృష్టించిన MI

ఢిల్లీతో మ్యాచ్‌లో విజయం సాధించిన MI ఓ అరుదైన రికార్డు సృష్టించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 200+ స్కోర్ చేసిన ప్రతిసారీ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు వరుసగా 15 మ్యాచుల్లో ఇలా గెలిచింది. DC కూడా వరుసగా 13 సందర్భాల్లోనూ ఓడిపోలేదు. అయితే 200+ స్కోర్‌ను CSK 21 సార్లు డిఫెండ్ చేసుకోగా ఐదుసార్లు ఓడిపోవడం గమనార్హం. ఆ తర్వాత RCB(W-19, L-5), SRH(W-15, L-2) ఉన్నాయి.
Similar News
News April 18, 2025
DANGER: రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా?

ధూమపానం వల్ల ఎలాంటి అనర్థాలున్నాయో సిట్టింగ్ వల్ల కూడా అంతే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి. ఎముకలు పెళుసుగా మారతాయి. అలాగే, గుండె జబ్బులు, టైప్-2 డయాబెటీస్‌తో పాటు కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడతారు. వెన్ను నొప్పి, డిస్క్ సమస్యలొస్తాయి. జీవక్రియ నెమ్మదిస్తుంది. అందుకే 45 నిమిషాలకొకసారి 10 నిమిషాలు నడిస్తే మంచిది’ అని సూచిస్తున్నారు.
News April 18, 2025
మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంపు?

టెలికాం కంపెనీలు మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంచబోతున్నట్లు మనీకంట్రోల్ తెలిపింది. ఈ ఏడాది చివర్లో 10-20% పెంపు ఉండబోతున్నట్లు పేర్కొంది. నవంబర్-డిసెంబర్ నెలల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రీఛార్జ్ ధరల పెంపును ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించింది. ARPU వృద్ధి, మూలధనంపై మెరుగైన రాబడి కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గత జులైలోనే టెలికామ్ సంస్థలు టారిఫ్లను పెంచాయి.
News April 18, 2025
క్రికెటర్లు అసభ్య ఫొటోలు పంపేవారు: అనయా

తనకు కొందరు క్రికెటర్లు న్యూడ్ ఫొటోలు పంపేవారని టీమ్ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ కూతురు అనయా తెలిపారు. ఓ సీనియర్ క్రికెటర్ తనతో బెడ్ పంచుకోవాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. తోటివారితో ఎన్నో అవమానాలకు గురైనట్లు వెల్లడించారు. కాగా బంగర్ కుమారుడు ఆర్యన్ లింగమార్పిడి చేయించుకుని అనయాగా మారారు. అంతకుముందు యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు.