News April 14, 2025
ఎన్టీఆర్: బీ-ఫార్మసీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో బీ-ఫార్మసీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ థియరీ రెగ్యులర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 19, 22, 24, 26, 29, మే 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వర్సిటీ పరిధిలోని 3 కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.
Similar News
News March 24, 2026
‘మన ఇసుక’ యాప్ ద్వారానే అనుమతులు: కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ జిల్లాలో ‘మన ఇసుక’ వాహనం యాప్ ద్వారానే ఇసుక అమ్మకాల అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లో రెవెన్యూ అంశాలపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఆన్‌లైన్ విధానంలో కూపన్లు జారీ చేయడం వల్ల ఇసుక విక్రయాల్లో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. తహశీల్దార్లందరూ ఈ యాప్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
News March 24, 2026
NGKL: ఏప్రిల్ 1 నుంచి 3 వరకు సలేశ్వరం జాతర!

వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్న సలేశ్వరం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, డీఎఫ్ఓ రేవంత్ చంద్రలతో కలిసి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, రవాణా, భద్రతా సౌకర్యాలు కల్పించాలని ఆలయ కమిటీకి సూచించారు.
News March 24, 2026
ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించిన SP

పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ ప్రతిభ కనబరిచిన పోలీసులను ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందించి ప్రోత్సహించారు. బాధితులకు న్యాయం జరిగినప్పుడే పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని.. ఆ దిశగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. జిల్లాలోని పోలీసులు బాధ్యతగా విధులు నిర్వహించి అందరి మెప్పు పొందాలని సూచించారు.


