News April 14, 2025
విజయవాడ: రైలు ప్రయాణికులకు ముఖ్య సూచన

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే ఒక రైలుకు ఖమ్మం, వరంగల్‌తో సహా 7 స్టేషన్లలో తాత్కాలికంగా స్టాప్ తొలగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మే 27, 28 తేదీలలో నం.18045 షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణలోని 7 స్టేషన్లలో ఆగదని, ఖాజీపేట మీదుగా కాక ఈ రైలు గుంటూరు, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్ వెళుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News January 13, 2026
కడప జిల్లాలో 99,508 హెక్టార్లలో రబీ పంటల సాగు

జిల్లాలో రబీ పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు కాగా, ఈ ఏడాది
99,508 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పప్పు సెనగ 68,207, మినుము 12,421, మొక్కజొన్న 5,390, వరి 4,223, జొన్న 2,110, కుసుమ 1.970, వేరుశనగ 1,259, గోధుమ 28, సజ్జ 783, రాగి 115, కొర్ర 81, కంది 143, పెసర 949, ప్రొద్దుతిరుగుడు 422, పత్తి 248 హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది 1,10,776 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు.
News January 13, 2026
కడియం నర్సరీలలో మొక్కలతో సంక్రాంతి శోభ

కడియం పల్ల వెంకన్న నర్సరీలో మంగళవారం సంక్రాంతి సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకుని మొక్కలతో రూపొందించిన ప్రత్యేక ఆకృతులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. భోగి మంట, పాలకుండ, గాలిపటం, ఎద్దు, కోడిపుంజు వంటి పండుగ ప్రతీకలను సృజనాత్మకంగా తీర్చిదిద్దారు. సంక్రాంతి శోభను ప్రతిబింబిస్తున్న ఈ మొక్కల కళాఖండాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
News January 13, 2026
సంగారెడ్డి: ‘నవజాత శిశు మరణాలు తగ్గించాలి’

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశు మరణాలు తగ్గించేలా చూడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు అన్నారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో వైద్యులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి 1,000 మంది శిశువుల్లో 18 మంది మరణిస్తున్నారని, ఆ సంఖ్య పదికి తగ్గించాలని సూచించారు. సమావేశంలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.


