News April 14, 2025
ఘోర ప్రమాదానికి కారణమైన వాహనం స్వాధీనం

సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని ధనాపురం వద్ద ఘోర ప్రమాదానికి కారణమైన వాహనాన్ని SI నరేంద్ర బెంగళూరులో స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం ఆటోను ఐచర్ వాహనం ఢీకొనగా ముగ్గురు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐచర్ వాహన డ్రైవర్ పరారై బెంగళూరులో తలదాచుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్‌ఐ తమ సిబ్బందితో వెళ్లి వాహనాన్ని సీజ్ చేసి పరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News September 15, 2025
కృష్ణా: ఇకపై వారికి APSRTC బస్సుల బాధ్యతలు

ఉమ్మడి కృష్ణాలో స్త్రీశక్తి పథకం మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు RTC సిద్ధమైంది. బస్‌స్టేషన్‌లలో పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్‌లకు బస్సులలో బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది. మరో 200 మంది కండక్టర్ల అవసరం ఉండగా..వారి నియామకం పూర్తయ్యేలోపు అవుట్‌సోర్సింగ్, బస్‌స్టేషన్‌లలో పనిచేస్తున్నవారి సేవలు వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా అవుట్‌సోర్సింగ్ నియామకాలు వద్దని యూనియన్ నాయకులు చెబుతున్నారు.
News September 15, 2025
మన విజయవాడలో అతిపెద్ద కన్సర్ట్ మారథాన్

విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు అతిపెద్ద కన్సర్ట్ మారథాన్ నిర్వహించనున్నట్లు టూరిజం శాఖ తెలిపింది. 11 రోజుల పాటు జరిగే నాన్‌స్టాప్ మ్యూజికల్ ప్రోగ్రామ్స్‌లో సంగీత దర్శకులు మణిశర్మ, RP పట్నాయక్, రామ్ మిరియాల, గాయకులు సునీత, గీతా మాధురి, కార్తీక్, సందీప్ నారాయణ్, అభిజిత్ నాయర్ పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయాస్ గ్రూప్ నిర్వహిస్తాయంది.
News September 15, 2025
MTM: ఎస్పీ గంగాధరరావుకు ఘన వీడ్కోలు

కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళ్తున్న ఆర్. గంగాధరరావు ఐపీఎస్‌కు పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. మచిలీపట్నం గోల్డ్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎస్పీతో తమ అనుభవాలను పంచుకున్నారు. తమకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి గంగాధరరావు కృతజ్ఞతలు తెలిపారు.