News April 14, 2025
కర్నూలులో నేడు PGRS రద్దు

కర్నూలులో నేడు నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని వివరించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మరోవైపు ఎస్పీ కార్యాలయంలోనూ ఈ కార్యక్రమం జరగదని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
Similar News
News April 16, 2025
ఎమ్మిగనూరు విద్యార్థినికి లోకేశ్ సన్మానం

ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్‌లో 987 మార్కులు సాధించిన యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్‌లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.
News April 16, 2025
అనుచిత వ్యాఖ్యలు.. గూడూరు యువకుల అరెస్ట్

గూడూరులో పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్ అనే యువకులను కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై గుంటూరులో సైబర్ క్రైం కేసు నమోదైంది. వారి ఆదేశాల మేరకు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
News April 16, 2025
KNL: నేమకల్లు పశువైద్య అధికారి నియామకం

చిప్పగిరి మండలంలోని నేమకల్లు గ్రామ పశువైద్య అధికారిగా కమలమ్మ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన మహేశ్ ఇతర విధుల బాధ్యతల కారణంగా వెళ్లడంతో ఆమె ఈ విధుల్లో చేరారు. ఆమె మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరిస్తామన్నారు. పశువులకు వచ్చే రోగాలకు వెంటనే టీకాలు వేయించుకోలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పశు వైద్యశాలకు వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.