News April 14, 2025
దండేపల్లిలో మహిళ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లిలో జరిగింది. ఎస్ఐ తౌసుద్దీన్ తెలిపిన వివరాలు.. దండేపల్లికి చెందిన గంగాధరి వరలక్మి (38) భర్త వేధింపులు, కుటుంబ కలహాలతో ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వరలక్ష్మి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News April 18, 2026
మహబూబ్‌నగర్‌లో ఉపాధి శిక్షణ

మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీల్లో ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాల కోసం కంపెనీలు రానున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు https://forms.gle/a7ComMvBg6wmPXhT9 లింక్ ద్వారా నమోదు చేసుకుని, సర్టిఫికేట్లతో హాజరుకావాలని అధికారిణి మైత్రి ప్రియ కోరారు. వివరాలకు 89193 80410 నంబర్‌ను సంప్రదించవచ్చు.
News April 18, 2026
పొదిలిలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా

పొదిలికి చెందిన కొదమల నాగరాజు అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇటీవల భర్త మరొక యువతితో సంబంధం పెట్టుకుని తనని వేధిస్తున్నాడని దీంతో పుట్టింటికి వెళ్లానని భార్య తెలిపింది. భర్తలో మార్పు రాకపోతుందా అని తాను ఇంటికి రాగా.. మామ అసభ్యంగా మాట్లాడి ఇంట్లోకి రానివ్వలేదని ఆరోపించింది. దీంతో ఆమె పిల్లలతో ఇంటి ముందు కూర్చుని ధర్నా చేసింది.
News April 18, 2026
నెల్లూరు: విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

లింగసముద్రం (M)లో విషాద ఘటన చోటుచేసుకుంది. జంపాలవారిపాలానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి గడ్డం వినయ్ బాబు స్నేహితులతో కలిసి జంగారెడ్డిపాలెం సమీపంలోని చెక్‌డ్యాం వద్ద ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI రాంబాబు దర్యాప్తు చేపట్టారు. శనివారం మృతదేహాన్ని చెక్‌డ్యాం నుంచి వెలికి తీసి పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.


