News April 14, 2025
కొవ్వూరు: అప్పు అడిగినందుకు హత్య

ఇటీవల దొమ్మేరు పుంతలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గురైన పెండ్యాల ప్రభాకర్‌రావు వేస్టేజ్ ఉద్యోగిగా పనిచేసేవారు. ఇతని వద్ద పెద్దవం సచివాలయ సర్వేయర్ శ్రీనివాస్ 2024లో రూ.2.4లక్షల అప్పు తీసుకున్నాడు. ప్రభాకర్ పలుమార్లు అడగడంతో విలాసాలకు అలవాటు పడ్డ శ్రీనివాస్ కక్ష పెట్టుకుని మరో ఇద్దరి సాయంతో హత్య చేసి కుడి చేతికున్న బంగారం కోసం చేతిని నరికేశారు. నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు.
Similar News
News March 17, 2026
ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్.. 24 అర్జీల స్వీకరణ

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి 24 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలపై ఫిర్యాదులు అందాయి. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను SP ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
News March 17, 2026
ఏలూరు రాజకీయాల్లో “పుట్టా“ రచ్చ

ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఏలూరు రాజకీయాల్లో హైదరాబాద్ ఫాంహౌస్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. డ్రగ్స్ తీసుకునే పార్టీలో ఎంపీ పట్టుబడటం అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ డ్రగ్స్ తీసుకున్నారని టెస్ట్‌లో పాజిటివ్ రావడాన్ని ఈగల్ టీమ్ SP ధృవీకరించారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటకొస్తానని MP అంటున్నారు. ఇటు టీడీపీ శ్రేణులు సైతం ఎంపీపై కుట్ర జరుగుతోందంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.
News March 17, 2026
భీమవరం: ‘ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’

రాబోయే వేసవిలో ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలి కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో భీమవరం కలెక్టరేట్లో సమీక్ష సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రదేశాలను గుర్తించి అక్కడ తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.


