News April 14, 2025
సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు.. జూపార్క్ ఓపెన్

అంబేడ్కర్ జయంతి సందర్భంగా సాలార్ జంగ్ మ్యూజియానికి అధికారులు సెలవు ప్రకటించారు. యథావిధిగా రేపు ఉదయం టూరిస్టులకు అనుమతి ఉంటుందని అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ అధికారి ఘన్ శ్యామ్ కుసుమ్ తెలిపారు. ఇదిలా ఉంటే సాధారణంగా ప్రతి సోమవారం జూపార్క్‌కు సెలవు ఉంటుంది. కానీ, నేడు తెరిచే ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. సందర్శకులు గమనించాలని సూచించారు.
Similar News
News November 1, 2025
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్

వర్ష ప్రభావంతో వరద చేరే లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం మధిరలోని లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. పెద్దచెరువు బ్యాక్ వాటర్ ప్రభావం వలన లోతట్టు ప్రాంతాల వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
News November 1, 2025
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

ఐ. పోలవరం మండలంలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రాయపరెడ్డి సత్య వెంకటకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బాలికను ఆరుసార్లు అత్యాచారం చేసినట్లు విచారణలో అంగీకరించాడని అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ తెలిపారు. నిందితుడిపై దొంగ నోట్ల చలామణితో పాటు మోటార్ సైకిల్ చోరీ కేసులు కూడా ఉన్నాయని డీఎస్పీ వెల్లడించారు.
News November 1, 2025
‘గ్లోబల్ స్టార్’ కాదు ‘మెగా పవర్ స్టార్’

రాజమౌళి ‘RRR’ మూవీతో రామ్ చరణ్‌కు గ్లోబల్ స్టార్ ట్యాగ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్’లో అదే ట్యాగ్‌ను మేకర్స్ ఉపయోగించారు. అయితే తాజాగా పెద్ది సినిమా పోస్టర్లో మెగా పవర్ స్టార్ అని కనిపించడం టీటౌన్లో చర్చనీయాంశంగా మారింది. ఇది మంచి నిర్ణయమని కొందరు అంటున్నారు. ట్యాగ్‌లతో వారి స్టార్డమ్కు ఎలాంటి డ్యామేజ్ ఉండదని మరికొందరు చెబుతున్నారు. మీరేమంటారు?


