News April 14, 2025

కియాలో ఇంజిన్ల చోరీ.. దర్యాప్తు ముమ్మరం!

image

పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్లు చోరీకి గురైన విషయం తెలిందే. ఈ ఘటనలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక్కడ పనిచేసిన మాజీ ఉద్యోగులను విచారిస్తున్నారు. పెనుకొండ సీఐ రాఘవన్ తన బృందంతో తమిళనాడుకు వెళ్లి పలువురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది. కాగా 2020 నుంచి ఈ చోరీలు జరుగుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.

Similar News

News November 1, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 తగ్గి రూ.1,23,000కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పతనమై రూ.1,12,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,66,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 1, 2025

టీడీపీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు: చంద్రబాబు

image

AP: టీడీపీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగుతామని పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని తెలిపారు. ఇకపై వారంలో తానొక రోజు, లోకేశ్ ఒకరోజు టీడీపీ ఆఫీసులో అందుబాటులో ఉంటామని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేస్తే తమ ప్రభుత్వం గాడిలో పెట్టిందని పేర్కొన్నారు.

News November 1, 2025

అమరావతి రైల్వే లైన్‌ నిర్మాణానికి భూసేకరణ.. ఎక్కడెక్కడంటే.!

image

అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కోసం ఎర్రుపాలెం-నంబూరు మధ్య 56 కి.మీ మేర భూసేకరణ పూర్తవుతోంది. నందిగామ, జగ్గయ్యపేట, VJA మీదుగా వెళ్లే ఈ మార్గానికి ఇప్పటికే 260 ఎకరాల వరకు ల్యాండ్ అక్విజైషన్‌ పూర్తయింది. ఇందులో నందిగామ, జగ్గయ్యపేటలలోనే సుమారు 250 ఎకరాలు ఉన్నాయి. అమరావతిలో 8 ప్లాట్‌ఫామ్‌లతో కోచింగ్ టెర్మినల్, VJA రద్దీని తగ్గించేందుకు గన్నవరం స్టేషన్‌లో టెర్మినల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.