News April 14, 2025
అడ్వైజరీ కమిటీలో పల్నాడు జిల్లాకు పెద్ద పీఠ: వైసీపీ

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో పల్నాడు జిల్లాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రాధాన్యత కల్పించారు. 33 మంది కమిటీలో జిల్లా నుంచి ముగ్గురికి స్థానం కల్పించడం విశేషం. చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి విడుదల రజిని, వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు, నరసరావుపేటకు చెందిన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని పీఏసీ మెంబర్‌లుగా జగన్ నియమించారు. వీరంతా వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News March 12, 2026
మహబూబ్ సాగర్ చెరువులో మృతదేహం లభ్యం

సంగారెడ్డి శివారులోని మహబూబ్ సాగర్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు 30- 35 ఏళ్ల మధ్య ఉంటుందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. మృతుడు ఒంటిపై చాక్లెట్ రంగు డ్రాయర్ మాత్రమే ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 12, 2026
కడప: రేపు వైవీయూ కాన్వకేషన్ .. ఏర్పాట్లు పూర్తి

యోగి వేమన విశ్వవిద్యాలయం కాన్వకేషన్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈ కృష్ణారావు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు లోపు విద్యార్థులు తిరుపతి బైపాస్ రోడ్డులోని డీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలన్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాల ప్రదానం జరుగుతుందన్నారు. వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తామన్నారు.
News March 12, 2026
CMకు వేసవి కార్యాచరణ ప్రణాళిక వివరించిన కలెక్టర్

CM చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ షాన్‌మోహన్ పాల్గొన్నారు. బుధవారం, గురువారం జరిగిన ఈ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాలు, ఇళ్ల నిర్మాణం, సంక్షేమం వంటి కీలక అంశాలపై చర్చించారు. జిల్లాలో వేసవి కార్యాచరణ ప్రణాళిక, రెవెన్యూ ప్రగతిపై పూర్తి వివరాలను ఆయన CMకు అందజేశారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రాధాన్యతలను త్వరితగతిన అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.


