News April 14, 2025

నెల్లూరు: ప్రేయసితో గొడవ.. ప్రియుడి ఆత్మహత్య

image

ప్రేమలో వచ్చిన గొడవలతో ఓ యువకుడు చనిపోయాడు. నెల్లూరులోని మనుమసిద్ధినగర్‌కు చెందిన రమణమ్మ, చిన్నయ్యల చిన్న కుమారుడు పోలయ్య(25) బంగారు పనిచేస్తుంటాడు. ఈక్రమంలో స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల వీరి మధ్య గొడవలు వచ్చాయి. మూడు రోజులుగా పోలయ్య ఎవరితోనూ మాట్లాడటం లేదు. కుటుంబ సభ్యులంతా సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పోలయ్య బెడ్ రూములోకి వెళ్లి ఉరేసుకున్నాడు.

Similar News

News April 18, 2025

నెల్లూరు కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నందన్

image

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ బదిలీ అయిన విషయం తెలిసిందే. నూతన కమిషనర్‌గా ఇంకా ఎవరిని నియమించలేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ అదనపు కమిషనర్ నందన్‌ను ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News April 18, 2025

నెల్లూరు: ఒకేసారి రూ.5వేలు పెరిగిన ధర

image

నెల్లూరు జిల్లాలో కొంతమేర నిమ్మ ధరలు పెరిగాయి. పొదలకూరు మార్కెట్‌లో లూజు బస్తా శుక్రవారం రూ.7వేల నుంచి రూ.9వేలు పలికింది. మంచు ప్రభావం తగ్గి వేసవితాపం పెరగడంతో ఢిల్లీలో మార్కెట్ ఊపందుకుంది. 15 రోజుల కిందట రూ.4,500 ఉన్న ధర ఒకేసారి రూ.5 వేలు పెరిగి రూ.9వేలకు చేరింది. దీంతో రైతులు చెట్లకు ఉన్న కాయలు జాగ్రత్తగా కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. చెన్నై, బెంగళూరు, కేరళకు తరలిస్తున్నారు.

News April 18, 2025

నెల్లూరు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి: యువరాజ్

image

అధికారులు సమన్వయంతో పనిచేసి నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ యువరాజ్ అధికారులకు సూచించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లో ఆయన కలెక్టర్ ఆనంద్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా మాత్రమే రెవెన్యూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అన్నారు.

error: Content is protected !!