News April 14, 2025
పెళ్లి పేరుతో మోసం.. యువకుడిపై కేసు

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన తిరుపతి జిల్లా బాలాయపల్లె మండలంలో వెలుగు చూసింది. భైరవరం పంచాయతీకి చెందిన పోలయ్య ఓ యువతి(19)ని మూడేళ్లుగా ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇటీవలే ఆమె ఐదు నెలల గర్భిణి అని తేలింది. దీంతో పెళ్లి చేసుకోవాలని పోలయ్యను కోరగా.. అతడు నిరాకరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలయ్యపై కేసు నమోదు చేశారు.
Similar News
News March 14, 2026
శ్రీశైలంలో రేపటి వరకే స్పర్శ దర్శనం

శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శన భాగ్యం ఆదివారం సాయంత్రం వరకే భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో కన్నడ భక్తులు భారీగా తరలివస్తుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు ఉత్సవాలు ముగిసే వరకు కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా సౌకర్యాల కోసం మార్పులు చేసినట్లు దేవస్థానం వెల్లడించింది.
News March 14, 2026
కృష్ణా: నడి రోడ్డుపైనే రుబాబు..!

ఉమ్మడి కృష్ణాలో రోడ్డు భద్రత, టార్గెట్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు సామాన్యుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. తనిఖీల్లో కేవలం బైక్‌లనే ఆపి, తాళాలు లాక్కుని యూట్యూబ్ ఛానళ్లతో వీడియోలు తీయించి నేరస్థుల్లా అవమానిస్తున్నారని చెబుతున్నారు. కార్లను వదిలేసి, బైకర్ల నుంచి రూ.150 నుంచి రూ.1500 వరకు తమ వ్యక్తిగత నంబర్లకు ఫోన్‌పే చేయించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 14, 2026
సోనమ్ వాంగ్‌చుక్‌ను విడుదల చేస్తాం: కేంద్రం

నేషనల్ సెక్యూరిటీ యాక్ట్(NSA) కింద 6 నెలలుగా జైలులో ఉన్న పర్యావరణవేత్త <<17827658>>సోనమ్ వాంగ్‌చుక్<<>>ను విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ‘లద్దాక్‌లో శాంతి, స్థిరత్వం కోసం కట్టుబడి ఉన్నాం. అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలకు సిద్ధం. ఇందులో భాగంగా సోనమ్ శిక్షను రద్దు చేస్తున్నాం’ అని పేర్కొంది. లద్దాక్‌లో అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలతో గతేడాది SEP 26న సోనమ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


