News April 14, 2025

దరఖాస్తు గడువు పొడిగించాలి: యూనుస్ 

image

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువును మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఏఐఎస్ఎఫ్ జనగామ జిల్లా కన్వీనర్ మహమ్మద్ యూనుస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నుంచి 3 రోజులు ప్రభుత్వ సెలవులు రావడంతో నిరుద్యోగులు కుల, ఆదాయ, నివాసం సర్టిఫికెట్ల తీసుకోలేక పోవడంతో పథకానికి దరఖాస్తు చేయలేకపోయారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గడువు పెంచాలని కోరారు.

Similar News

News March 27, 2026

‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

image

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
<<7337592828>>Click on Whatsapp<<>>

News March 27, 2026

రూ.351 కోట్లతో భద్రాద్రి క్షేత్ర పునర్నిర్మాణం: సీఎం

image

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ రూపురేఖలు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తొలి దశలో రూ.351 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ నిధులతో రూ.180 కోట్లతో ఆలయ విస్తరణ, రూ.75 కోట్లతో గోదావరి ఘాట్ల ఆధునీకరణ, రూ.96 కోట్లతో క్షేత్ర సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.

News March 27, 2026

కోపం, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఇలా చేస్తే..!

image

కోపం, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఎదుటివారిపై చూపకుండా మనసును ఇంట్లోని పనుల మీదకు మళ్లించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ‘వాష్‌రూమ్ క్లీనింగ్‌కు టైమ్ కేటాయిస్తే అది పూర్తయ్యేలోపు కోపం తగ్గుతుంది. అలాగే వంట చేయడం, చెప్పులు శుభ్రం చేసుకోవడం, ఫ్రిజ్‌‌లోని ఐటమ్స్‌ చక్కగా అరేంజ్ చేయడం, అద్దాలు శుభ్రం చేయడం వంటివి అనుసరించాలి. దీంతో ఇల్లు శుభ్రం కావడంతో పాటు కోపం నుంచీ బయటపడొచ్చు’ అని సూచిస్తున్నారు.