News April 14, 2025
మార్కుల ఆనందం ఆవిరైంది!

కదిరిలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న శారద (40) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆమె కుమార్తె కీర్తి విజయవాడలో ఇంటర్ చదువుతుండగా 973 మార్కులు వచ్చాయి. దీంతో విజయవాడ నుంచి కుమార్తెను తీసుకుని అరుణాచలం వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి కారులో వస్తుండగా పుంగనూరు మండలం సుగాలిమిట్టలో లారీ ఢీకొని చనిపోయారు. ఈ ఘటనలో భర్త, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని బెంగళూరుకు తరలించారు.
Similar News
News February 25, 2026
పోలవరంలో పెద్దపులి సమాచారం..అధికారుల తీరుపై అసహనం

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచరించడం తెలిసిందే. అయితే అటవీశాఖ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. పులిని దట్టమైన అటవిలో వదిలి ఉండాల్సిందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం నల్లమల అటవీ ప్రాంతంలో ఇప్పటికే చాలా పులులు ఉండడం వల్ల ఇక్కడ వదలాల్సి వచ్చిందని, గతంలో పులి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తిరిగినా ఎవరికి హాని చేయలేదని గుర్తు చేస్తున్నారు.
News February 25, 2026
BREAKING: పాలమూరు: ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాలు.. MBNR జిల్లా నవాబ్‌పేట్(M) చాకలిపల్లికి చెందిన పురుషోత్తం(19) యన్మంగండ్లలోని కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఇంటర్ పరీక్షల నేపథ్యంలో చదువుపై శ్రద్ధ వహించడం లేదని కుటుంబీకులు ఇటీవల అతడిని మందలించారు. దీంతోపాటు ఇటీవల అతడి లవ్ కూడా ఫెయిలైందని మనస్తాపంతో ఉన్నాడు. ఈ క్రమంలో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.
News February 25, 2026
HPV వ్యాక్సిన్ గురించి తెలుసా?

హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ తొమ్మిదేళ్ల వయసు నాటి నుంచి 45 ఏళ్ల వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే దీన్ని గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. 9 నుంచి 15 సంవత్సరాల లోపు అమ్మాయిలు రెండు డోసులు, 15 సంవత్సరాలు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు తీసుకున్న తర్వాత రెండో డోసును రెండు నెలల తర్వాత తీసుకోవాలి.


