News March 27, 2024

కరవును రాజకీయం చేయొద్దు: మంత్రి పొన్నం

image

బీఆర్ఎస్ కరవు, వర్షపాతానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరవుకి కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణం కాదని, అది ప్రకృతి ప్రభావం అని పేర్కొన్నారు. ప్రకృతిలో ఏర్పడ్డ ఇబ్బందులకు ఎవరూ బాధ్యులు కారన్నారు. వేసవిలో తాగునీరు, సాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Similar News

News March 18, 2026

మెదక్: ‘కార్మిక సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి’

image

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బుధవారం ఢిల్లీలోని ESIC ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారు. కార్మిక సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

News March 18, 2026

నిజాంపేట: తిప్పన్నగుల్లలో కాకతీయ కాలపు శివాలయం గుర్తింపు

image

నిజాంపేట మండలం తిప్పన్నగుల్లలో కాకతీయ శైలికి చెందిన పురాతన శివాలయాన్ని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ సభ్యుడు బుర్ర సంతోష్ గుర్తించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయంలో శివలింగం లేకపోయినా, లతలు, సింహాలు, హంసల చెక్కడాలతో కూడిన మూడు గర్భద్వారాలు అద్భుతంగా ఉన్నాయి. శైవ ద్వారపాలకుల శిల్పాలు ఈ ఆలయ విశిష్టతను చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

News March 18, 2026

తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో నేడు కిసాన్ మేళా

image

కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం ‘కిసాన్ మేళా-2026’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి స్వప్న జాదవ్ తెలిపారు. సుమారు వెయ్యి మంది రైతులతో నిర్వహించే ఈ మేళాలో ఆధునిక యంత్రాల ప్రదర్శన, శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష చర్చలు, సరికొత్త సాగు సాంకేతికతపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించనున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.