News April 14, 2025

కొయ్యూరు మండలంలో గాలివాన బీభత్సం

image

కొయ్యూరు మండలంలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం పలకజీడి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని ఛిన్నాభిన్నం చేసింది. వసతి గృహంలో ఇనుప రాడ్స్ అన్నీ విరిగిపోయి, పైకప్పు మొత్తం ఎగిరి పోయిందని వార్డెన్ రాజేశ్వరి సోమవారం ఉదయం తెలిపారు. తనతో పాటు అక్కడే ఉన్న 20మంది విద్యార్థులు వేరే భవనంలోకి పరుగులు తీశామన్నారు.

Similar News

News March 5, 2026

కేయూ పరిధిలో పీజీ తొలి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల తొలి సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల పరీక్షలు ఈ నెల 5, 7, 10, 12, 16, 18 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 4,149 మంది విద్యార్థుల కోసం 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

News March 5, 2026

తూ.గో: ఖాళీ ఇంటికి రూ.1.99కోట్ల కరెంట్ బిల్లు

image

సామర్లకోట టిడ్కో కాలనీకి చెందిన దాసరి దుర్గకు విద్యుత్ శాఖ భారీ బిల్లుతో షాక్ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో వచ్చిన బిల్లు ఏకంగా రూ.1.99కోట్లుగా ఉండటంతో ఆమె షాక్‌కు గురైంది. ప్రస్తుతం టిడ్కో ఫ్లాట్‌లో ఎవరూ నివాసం లేకపోయినా ఇంత భారీగా బిల్లు రావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపమా లేక అధికారుల నిర్లక్ష్యమా అని స్థానికులు జోరుగా చర్చించుకుంటున్నారు.

News March 5, 2026

GNT: రక్తపు మడుగులో వ్యక్తి.. కాపాడిన వైద్యులు..!

image

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని తెనాలి వైద్యులు కాపాడారు. బాపట్ల (D) చుండూరు (M) ఆలపాడుకు చెందిన జి. నాగేశ్వరరావు అపరాల నూర్పిడి యంత్రం వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు చేయి తెగి తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు వెంటనే తెనాలి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆర్థోపెడిక్ వైద్యులు హనుమంతరావు బృందం అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. తెగిపోయిన చేతిని తొలగించి, రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడారు.