News April 14, 2025
హనుమకొండ: ‘పిల్లలపై నిరంతరం నిఘా ఉంచండి’

జిల్లాలో మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Similar News
News September 17, 2025
20న తిరుపతిలో జాబ్ మేళా

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌లో 20వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 9 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీఫార్మసీ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. 550 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
News September 17, 2025
హస్తంలో చిచ్చుపెట్టిన జూబ్లీహిల్స్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హస్తం పార్టీలో చిచ్చు పెట్టింది. అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. పాత నేతలంతా టికెట్ కోసం హస్తిన నుంచి ఫైరవీ మొదలెట్టారు. దానం నాగేందర్, అంజన్ కుమార్, నవీన్ కుమార్, PJR కుమార్తె విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీసీ నేతను పోటీకి దింపేందుకు INC నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు CM, TPCC చీఫ్ నిర్ణయమే కీలకంగా మారుతోంది.
News September 17, 2025
ప్రజాపాలన దినోత్సవం.. ఎస్పీ జెండా ఆవిష్కరణ

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో SP మహేష్ బీ గితే ఇవాళ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. వారి పోరాట ఫలితంగానే మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నామని కొనియాడారు. వేములవాడ ASP శేషాద్రి రెడ్డి, అదనపు SP చంద్రయ్య, CIలు, RIలు, SIలు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.