News April 14, 2025

జనగామ: ‘పిల్లలపై నిరంతరం నిఘా ఉంచండి’

image

జిల్లాలో మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Similar News

News April 18, 2025

నెల్లూరు కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నందన్

image

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ బదిలీ అయిన విషయం తెలిసిందే. నూతన కమిషనర్‌గా ఇంకా ఎవరిని నియమించలేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ అదనపు కమిషనర్ నందన్‌ను ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News April 18, 2025

UPI పేమెంట్స్‌పై GST.. క్లారిటీ

image

రూ.2వేలకు పైన చేసే UPI పేమెంట్స్‌పై కేంద్రం 18% GST విధించనున్నట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలపై కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. అవన్నీ నిరాధార, తప్పుదోవ పట్టించే వార్తలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమీ లేవని స్పష్టం చేసింది.

News April 18, 2025

కాటారం: వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

ఆదివారంపేట వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు. కొన్ని రోజుల క్రితం మృతురాలు మల్లక్క(67) కోడలు శ్రీలతతో నిందితుడు శివ(42)కు పరిచయమైంది. కాగజ్‌నగర్‌లో ఇద్దరు 3 నెలలు సహజీవనం చేశారు. శివ వేధింపులు తాళలేక శ్రీలత ఆదివారంపేటకు వచ్చింది. శ్రీలతను కలవాలని శివ చూడగా నిరాకరించింది. మల్లక్కను చంపితే కేసు శ్రీలత మీదకే వస్తుందని భావించి హత్య చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు.

error: Content is protected !!