News April 14, 2025

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

image

భద్రకాళి అమ్మవారు సోమవారం సందర్భంగా భక్తులకు ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో జరుగుతున్న కార్యక్రమంలో అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను సమర్పించారు. భక్తులు అమ్మవారి దివ్యదర్శనాన్ని పొందేందుకు భక్తులు తరలిరావడంతో ప్రాంగణమంతా కిటకిటలాడింది.

Similar News

News March 27, 2026

కడప: ఆశ వర్కర్ల నియామకంలో గోల్మాల్?

image

కడప జిల్లాలో ఇటీవల జరిగిన ఆశా వర్కర్ల నియామకంలో పూర్తిస్థాయిలో అవినీతి జరిగిందంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన మహిళలకు కాకుండా అనర్హత కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఆధారాలతో ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారిని మాత్రమే నియమించారని ఆరోపణలు ఉన్నాయి.

News March 27, 2026

కాసేపట్లో మోదీ మీటింగ్.. ఏం జరగనుంది?

image

PM మోదీ సా.6.30 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పశ్చిమాసియా యుద్ధం దేశంపై చూపుతున్న ప్రభావంపై టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సప్లై సన్నద్ధతపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇవే కాకుండా మోదీ వేరే అంశాలపై ఏమైనా కీలక ఆదేశాలు/ప్రకటన ఇస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే దేశంలో <<19488586>>లాక్‌డౌన్<<>> ప్రచారాన్ని కేంద్రం ఇప్పటికే ఖండించింది.

News March 27, 2026

GK: చంద్రయాన్-3 విశేషాలు

image

⋆ ప్రయోగం తేదీ: జులై 14, 2023
⋆ చంద్రుడిపై ల్యాండింగ్: AUG 23, 2023
⋆ రాకెట్ పేరు: LVM3-M4, ల్యాండర్: విక్రమ్, రోవర్: ప్రజ్ఞాన్
⋆ చంద్రయాన్-3 ల్యాండయిన ప్రదేశానికి ‘శివశక్తి పాయింట్’ అని పేరు పెట్టారు
⋆ ల్యాండింగ్ తేదీని కేంద్రం నేషనల్ స్పేస్ డేగా ప్రకటించింది
⋆ చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్
⋆ US, రష్యా, చైనా తర్వాత విజయవంతంగా ల్యాండింగ్ చేసిన 4th దేశంగా భారత్