News April 14, 2025
వేములవాడ: వ్యక్తి దారుణ హత్య

వేములవాడలోని ఓ ఫంక్షనల్ వద్ద ఆదివారం సాయంత్రం వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పరశురాం (39)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమర్చారు. మృతుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 12, 2026
సిరిసిల్ల: ప్రజావాణికి 122 దరఖాస్తుల స్వీకరణ

సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమానికి బాధితుల నుంచి 122 దరఖాస్తులు వచ్చాయి. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News January 12, 2026
అనకాపల్లి: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌కు 317 అర్జీలు

అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు మొత్తం 317 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావు మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
News January 12, 2026
అగ్నివీర్ వాయు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<


