News April 14, 2025

సంగారెడ్డి: మహిళా అదృశ్యం.. కేసు నమోదు

image

మహిళా అదృశ్యమైన ఘటన కల్హేర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. మండలంలోని బిబిపేటకు చెందిన కుమ్మరి సునీత ఈనెల 12న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కల్హేర్ ఎస్ఐ వెంకటేశం తెలిపారు.

Similar News

News March 21, 2026

రాజానగరం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలు!

image

రాజానగరం జాతీయ రహదారి ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి వాడపల్లి వెళ్తుండగా వీరి కారును రాజమండ్రి నుంచి కాకినాడ వైపు వస్తున్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీఎస్‌ఎల్ ఆస్పత్రికి తరలించారు. కారులో డ్రైవర్‌తో సహా మొత్తం ఏడుగురు ఉండగా, బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2026

విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలర్ట్

image

విశాఖపట్నం – బ్రహ్మపూర్ ప్యాసింజర్ (58532) రైలు రీషెడ్యూల్ అయింది. మార్చి 21న సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, అనివార్య కారణాల వల్ల రాత్రి 6:50 గంటలకు బయలుదేరనుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తూ, ఈ మార్పును గమనించి ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు.

News March 21, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,800
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,616
*వెండి 10 గ్రాముల ధర రూ.2310