News April 14, 2025

కాకినాడ జిల్లా ప్రజలకు హెచ్చరిక 

image

కాకినాడ జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పిడుగులు పడే అవకాశాలు నెలకొని ఉన్నాయని సోమవారం జిల్లాలోని కాకినాడ పెదపూడి సామర్లకోట పెద్దాపురం తదితర ప్రాంతాల ప్రజల ఫోన్లకు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థచే హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ హెచ్చరికలు అనేకసార్లు నిజమయ్యాయి.

Similar News

News September 17, 2025

సంగారెడ్డి: ఉపాధ్యాయుల శిక్షణ వాయిదా

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు నేటి నుంచి జరగాల్సిన శిక్షణ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. శిక్షణ కార్యక్రమం తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని జిల్లాలోని ఉపాధ్యాయులందరూ గమనించాలని సూచించారు.

News September 17, 2025

తిరుపతి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు

image

మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా చిల్డ్రన్ హోమ్స్, వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం పేర్కొంది. శ్రీకాళహస్తిలో 7, కోటలో 2, SAA యూనిట్‌లో 5, DCPU యూనిట్‌లో ఓ పోస్టుతో పాటు మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. కేవలం మహిళలే అర్హులు. ఇతర వివరాలకు https://tirupati.ap.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు. చివరి తేదీ సెప్టెంబర్ 19.

News September 17, 2025

సంచలన తీర్పులకు కేరాఫ్.. నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు

image

నల్గొండ పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పులకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి N.రోజారమణి తన తీర్పులతో తప్పు చేయాలనుకునే వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జులై 4 నుంచి ఈ నెల 16 వరకు పది పోక్సో కేసుల్లో తీర్పులిచ్చారు. వీటిలో ఒక కేసులో దోషికి ఉరి శిక్ష, మిగిలిన కేసుల్లో కనీసం 20 ఏళ్లకు తగ్గకుండా శిక్షలు విధించారు.