News April 14, 2025

కోటపల్లి: నవదంపతుల సూసైడ్

image

పెళ్లైన 6 నెలలకే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటపల్లి (M) దేవులవాడకు చెందిన సృజన(30) లక్షెట్టిపేటలో డిగ్రీ చదువుతోంది. కులాలు వేరే కావడంతో పెద్దలను ఎదురించి సీనియర్ విష్ణువర్ధన్‌‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ మార్చి 24న గోదావరిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సృజన ఇంట్లోనే ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుబుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News July 7, 2025

ANMల బదిలీలలో చిక్కుముడులు.. మరోసారి కౌన్సెలింగ్

image

గుంటూరు జిల్లా వైద్య శాఖ ఇటీవల ANM గ్రేడ్-3గా ఉన్న సుమారు 200 మందికి పదోన్నతులు మంజూరు చేసి కొత్త నియామకాలు ఇచ్చింది. కానీ గత కౌన్సెలింగ్‌లో అదే పోస్టులు ఖాళీలుగా చూపటంతో పలువురు ఎంపిక చేసుకున్నారు. ఈ అంశం అధికారులు గుర్తించడంతో గత కౌన్సెలింగ్‌ను రద్దు చేసి సోమవారం మళ్లీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మీ తెలిపారు. ఈసారి ప్రక్రియ సునిశ్చితంగా, సీనియారిటీ ప్రాతిపదికన సాగనుంది.

News July 7, 2025

ఉమ్మడి పాలమూరు గిరిజనులకు GOOD NEWS

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రంలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన నియోజకవర్గాలకు మొత్తం 8,750 ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా 1,319 ఇండ్లు శాంక్షన్ చేసినట్లు తెలిపింది. ఈ లబ్ధిదారులకు ఈరోజు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అచ్చంపేటలోని మున్ననూర్‌లో మంజూరు పత్రాలను ఇవ్వనున్నారు.

News July 7, 2025

భద్రాద్రి జిల్లాలో 25 మలేరియా, 9 డెంగీ కేసుల నిర్ధారణ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 25 మలేరియా, 9 డెంగీ కేసులను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. ఇదే అదునుగా పరీక్షల పేరిట అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని, చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.