News April 14, 2025
వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన నిన్న పాన్‌గల్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అన్నారం, దావాజీపల్లి గ్రామాల మధ్య పాన్‌గల్ వాసి ఆర్ఎంపీ స్వాములు, నాగవరం వాసి నాగేంద్ర ఇద్దరు బైకులు ఎదురెదుగా వచ్చి ఢీకొట్టుకున్నారు. ఈ ప్రమాదంలో నాగేంద్రకు తీవ్రగాయాలు కావటంలో వనపర్తి ఆసుపత్రికి తరలించారు. ఆర్ఎంపీ కాలు విరగటంతో కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 14, 2026
గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యమైందా? కాల్ చేయండి!

బుక్ చేసిన సిలిండర్ రెండున్నర రోజుల్లోనే డెలివరీ చేయాలనే రూల్ ఉంది. ఏజెన్సీలు సిలిండర్ పంపడంలో ఆలస్యం చేస్తే యూజర్లు ఆయిల్ కంపెనీలకు ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 1800-233-3555కు కాల్ చేసి గ్యాస్ ప్రొవైడర్‌ను తెలియజేస్తే సంబంధిత విభాగాలకు మీ ఫిర్యాదును బదిలీ చేస్తారు. బుకింగ్ కోసం HP-96660 23456, INDANE- 77189 55555, BHARAT-77150 12345 ఈ నంబర్లకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి కాల్ చేయండి.
News March 14, 2026
ప.గో: గ్యాస్ కష్టాలు.. బ్లాక్‌లో సిలిండర్ రూ.1800

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ధరల మోతతో పాటు సర్వర్ల మొరాయింపుతో ఇబ్బందులు పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బుకింగ్ కోసం అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సి వస్తోందని, ఓటీపీ వస్తేనే ఏజెన్సీలు సిలిండర్లు ఇస్తున్నాయని వాపోతున్నారు. ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ లో రూ.1400 నుంచి రూ.1800 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. అధికారులు స్పందించి అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
News March 14, 2026
MHBD: టెన్త్ పరీక్షలకు 8,157 మంది విద్యార్థులు

జిల్లాలో నేటి నుంచి మొదలుకానున్న టెన్త్ పరీక్షలకు మొత్తం 45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 4,001 మంది బాలికలు, 4,156 మంది బాలురు మొత్తం 8,157 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 435 మంది ఇన్విజిలేటర్లు, 45 చీఫ్ సూపరింటెండెట్లు, 45 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు.


