News April 14, 2025

3 రాష్ట్రాలు, 700 CCTVల పరిశీలన.. నిందితుడు అరెస్ట్

image

ఇటీవల బెంగళూరులో రోడ్డుపై వెళ్తున్న మహిళను <<16013655>>లైంగికంగా<<>> వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక, TN, కేరళలో 700 CCTVలను పరిశీలించి నిందితుడు సంతోష్‌ను కోజికోడ్‌లో ట్రేస్ చేశారు. ఇతను BNGLలోని ఓ షోరూమ్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా ఆ ఘటన తర్వాత నగరాల్లో లైంగిక వేధింపులు సాధారణమే అని మంత్రి పరమేశ్వర కామెంట్స్ చేసి తర్వాత క్షమాపణ కోరిన విషయం తెలిసిందే.

Similar News

News September 18, 2025

తగ్గిన బంగారం ధరలు!

image

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.540 తగ్గి రూ.1,11,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.500 పతనమై రూ.1,01,900 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,41,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 18, 2025

మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్‌పై విమర్శలు

image

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్‌కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.

News September 18, 2025

అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

image

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.