News April 14, 2025
నేడు అంబేడ్కర్ జయంతి.. సెలవు

రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా సెలవు ఉంది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు పని చేయవు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు.
Similar News
News January 12, 2026
WPL: ఈరోజు RCB vs UPW మ్యాచ్

WPLలో భాగంగా నేడు RCB, యూపీ వారియర్స్ తలపడనున్నాయి. RCB తొలి మ్యాచ్‌లో MIపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి జోరుమీద ఉంది. ఇక UPW తన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకూ ఇరు జట్లు హెడ్ టు హెడ్ ఆరు సార్లు తలపడగా చెరో మూడు మ్యాచ్‌లు గెలిచాయి. రాత్రి 7:30 నుంచి హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.
News January 12, 2026
పాపం శ్రీలీల.. బాలీవుడ్‌పైనే ఆశలు

ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల చెప్పుకోదగ్గ హిట్లు లేక సతమతమవుతోంది. తెలుగులో గత ఏడాది చేసిన సినిమాలు ఆకట్టుకోలేదు. ఈ ఏడాది తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. శివ కార్తికేయన్ సరసన నటించిన ‘పరాశక్తి’ మూవీ తాజాగా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో అమ్మడికి కోలీవుడ్‌లో ఆఫర్లు రావడం గగనమేనని తెలుస్తోంది. ఈ క్రమంలో కార్తీక్ ఆర్యన్‌తో నటిస్తున్న బాలీవుడ్ మూవీపైనే ఈ బ్యూటీ ఆశలు పెట్టుకున్నారు.
News January 12, 2026
మకర జ్యోతి పర్వదినానికి భారీ ఏర్పాట్లు

కేరళలోని శబరిమలలో జనవరి 14న జరగనున్న మకరవిలక్కు (మకర జ్యోతి) దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏడీఎం అరుణ్ ఎస్ నాయర్ తెలిపారు. భక్తుల భద్రత కోసం బారికేడ్లు, ఇతర సౌకర్యాలు సిద్ధం చేశామన్నారు. హైకోర్టు ఆదేశాలతో దర్శనానికి కఠిన పరిమితులు విధించారు. 14న వర్చువల్ క్యూ ద్వారా 30 వేల మందికే అనుమతి ఉంటుంది. తిరువాభరణ ఊరేగింపు నేపథ్యంలో పంబా-సన్నిధానం మార్గంలో తాత్కాలిక ఆంక్షలు అమలు చేయనున్నారు.


