News April 14, 2025

ఏటూరునాగారం: ‘మావో’లకు వ్యతిరేకంగా పోస్టర్లు!

image

ఏటూరునాగారంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివాసీ యువజన సంఘం పేరుతో ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ఆదివాసీలను అడవుల్లోకి వెళ్లకుండా బాంబులు పెట్టి అడ్డుకుంటున్నారని, ఆదివాసీల మీద ‘మావో’ల అప్రకటిత యుద్ధం ఏంటని ప్రశ్నించారు. ఆదివాసీలను చంపటం మీ సిద్ధంతమా? ఇందుకోసమేనా మీ పోరాటం? అని రాసుకొచ్చారు.

Similar News

News April 1, 2026

సూర్యాపేట: వర్గపోరు.. సర్పంచ్ మామపై దాడి

image

అడ్లూర్‌లో సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ నెల 29న జరిగిన గ్రామసభలో ఇరువర్గాలు తలపడగా, మంగళవారం రాత్రి సర్పంచ్ మామ గువ్వల రామకోటయ్యపై ఉపసర్పంచ్ వర్గం దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 1, 2026

GNT: నూతన ఆర్ధిక సంవత్సరం.. అధికారుల హడావుడి

image

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో అన్ని శాఖల్లో పనుల వేగం పెరిగింది. గత కాల పనుల పురోగతిని మార్చి 31తో కొలిచిన ప్రభుత్వం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. డ్వామా, DRDA, హౌసింగ్, వ్యవసాయ శాఖలు కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఉపాధి పనులు పూర్తి చేశారు. డ్రిప్ ఇరిగేషన్, మహిళా రాయితీల ఫైల్స్ క్లియర్ చేశారు. ఇక పనుల ఎంపిక, అమలులో కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు కానున్నాయి.

News April 1, 2026

అమరావతి బిల్లుపై చర్చకు YCP

image

పార్లమెంటులో ఇవాళ ప్రవేశపెట్టే రాజధాని అమరావతి బిల్లుపై చర్చలో వైసీపీ పాల్గొననుంది. ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చర్చకు ఉంటుందని ఎంపీలతో స్పీకర్ చెప్పారు.