News April 14, 2025
ఏటూరునాగారం: ‘మావో’లకు వ్యతిరేకంగా పోస్టర్లు!

ఏటూరునాగారంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివాసీ యువజన సంఘం పేరుతో ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ఆదివాసీలను అడవుల్లోకి వెళ్లకుండా బాంబులు పెట్టి అడ్డుకుంటున్నారని, ఆదివాసీల మీద ‘మావో’ల అప్రకటిత యుద్ధం ఏంటని ప్రశ్నించారు. ఆదివాసీలను చంపటం మీ సిద్ధంతమా? ఇందుకోసమేనా మీ పోరాటం? అని రాసుకొచ్చారు.
Similar News
News July 5, 2025
విశాఖ గోల్డ్ వ్యాపారులకు హెచ్చరిక

విశాఖలో ఆభరణాల వ్యాపారులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (B.I.S.) హాల్ మార్కింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నిబంధనలు గురించి ఆభరణాల వ్యాపారులకు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చిక్కుడు తప్పవని B.I.S. దక్షిణ ప్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ ఖన్నా హెచ్చరించారు. B.I.S. కేర్ మొబైల్ యాప్ గురించి వివరించారు. విశాఖ నుంచి 100 మంది గోల్డ్ వ్యాపారులు హాజరయ్యారు.
News July 5, 2025
సూర్యాపేట: చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెంలో ఈరోజు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బస్టాండ్ వద్ద కాసాని నాగేశ్వరరావు వేపచెట్టు కొమ్మలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడ్డాడు. తీవ్ర గాయాలవగా మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.
News July 5, 2025
MBNR: సైబర్ నెరగాళ్లతో జాగ్రత్త: ఎస్పీ

పేదలను లక్ష్యంగా చేసుకుంటూ కొత్త తరహా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. నకిలీ యాప్‌లు, పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రం హోం తదితర ఫేక్ లింక్, యువతులపై ఆన్లైన్‌లో వేధింపులు, ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని చెప్పారు. అలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని, 1930 లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు.