News April 14, 2025
గుమ్మడిదల: భార్యతో గొడవ పడి ఆత్మహత్య

భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బీర్ల నాగరాజు (30) కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అనితతో 15 నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో నాగరాజు మనస్తాపానికి గురై వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
Similar News
News April 16, 2025
రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణం కావొద్దని మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టడంతో రోడ్లు ఇరుకుగా మారి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా ధాన్యంపై మోటార్ సైకిల్ వెళ్తే స్కిడ్ అయ్యి పడే అవకాశం ఉందన్నారు. రాత్రి సమయాల్లో రోడ్డుపై ధాన్యం కుప్పలు చేసి బండరాళ్లు పెట్టడంతో వాహనదారులు ప్రమాదాలుకు గురవతున్నారని, ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.
News April 16, 2025
భూభారతి చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

భూ భారతి చట్టంపై మండలాల్లో అవగాహన సదస్సులను పక్కాగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. ఆలాగే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఆర్డీవోలు,తహశీల్దార్లు, సివిల్ సప్లై అధికారులతో భూ భారతి చట్టం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్షించారు.
News April 16, 2025
మెదక్: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచుపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. రేగోడ్ మండలంలోని పట్టెపొలం తండాకు చెందిన లావుడియా సక్రీ బాయి, సుభాష్ బైక్పై వెళ్తున్నారు. నిజాంపేట్ మండలం బాచుపల్లి శివారులో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.