News April 14, 2025

అంబేడ్కర్ ఆశయ సాధనలో ప్రజా ప్రభుత్వం: CM రేవంత్

image

TG: అంబేడ్కర్ జయంతి సందర్భంగా CM రేవంత్ నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయ సాధనలో తమ ప్రభుత్వం ఎన్నో అడుగులు వేసిందని ట్వీట్ చేశారు. SC వర్గీకరణ, బడుగు- బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టరూపం, యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య, ఇందిరమ్మ భరోసా పథకం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతికి శ్రీకారం వంటివి ఉదాహరణగా చెప్పారు.

Similar News

News November 11, 2025

సనాతన ధర్మ భావాలను ఎగతాళి చేస్తే..: పవన్

image

AP: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు తిరుమల ఓ పుణ్యక్షేత్రమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రం. ఆ లడ్డూకు ఎంతో పవిత్రత ఉంది. ఏడాదికి సగటున రెండున్నర కోట్ల మంది భక్తులు వస్తుంటారు. విశ్వాసం, సనాతన ధర్మ భావాలను ఎవరైనా ఎగతాళి చేస్తే అది ఆధ్యాత్మిక నమ్మకాన్ని దెబ్బతీస్తుంది’ అని ట్వీట్ చేశారు.

News November 11, 2025

సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ(NIGST), సర్వే ఆఫ్ ఇండియాలో 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBA, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఈ, PhD ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్, రీసెర్చ్ అసోసియేట్, FRF పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://surveyofindia.gov.in

News November 11, 2025

యంగ్‌గా ఉండాలా.. ఎక్కువ భాషలు నేర్చుకో

image

వయసు పెరుగుతున్నా యంగ్‌గా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఒకే భాషలో మాట్లాడేవారితో పోలిస్తే 2 అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడేవారి మెదడు యవ్వనంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. 27 యూరోపియన్ దేశాలలో 51-90 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 80వేల మందిపై జరిపిన స్టడీలో ఇది వెల్లడైంది. ఒకే భాషలో మాట్లాడేవారి మెదడు 2 రెట్లు త్వరగా వృద్ధాప్య దశకు చేరుకుంటున్నట్టు స్పష్టమైంది. లేటెందుకు ఈరోజు నుంచే కొత్త భాష నేర్చుకోండి.