News April 14, 2025
కోటపల్లి: నవదంపతుల సూసైడ్

పెళ్లైన 6 నెలలకే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటపల్లి (M) దేవులవాడకు చెందిన సృజన(30) లక్షెట్టిపేటలో డిగ్రీ చదువుతోంది. కులాలు వేరే కావడంతో పెద్దలను ఎదురించి సీనియర్ విష్ణువర్ధన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ మార్చి 24న గోదావరిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సృజన ఇంట్లోనే ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుబుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News October 30, 2025
NGKL: రేపు ‘డయల్ యువర్ డీఎం’

రేపు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ డీఎం యాదయ్య తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలు 9959226288కు కాల్ చేసి తమ సలహాలు, సూచనలు తెలియజేయాలని ఆయన సూచించారు.
News October 30, 2025
అజహరుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు: భట్టి

TG: దేశ క్రికెట్‌కు సేవలందించిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని చూస్తే వ్యతిరేకించడం సరికాదని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. దీనిని స్వాగతించకుండా ECకి <<18147731>>లేఖ<<>> రాయడం దారుణమని చెప్పారు. రాష్ట్రంపై ప్రేమ ఉన్నవారు అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించరని మండిపడ్డారు. దీనిపై BJP, BRS కలిసే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. మైనార్టీ అన్న ద్వేషంతోనే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటున్నారన్నారు.
News October 30, 2025
227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం: కలెక్టర్

ఖమ్మం నగరంలో మున్నేరు నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో 90 కుటుంబాల పరిధిలో 227 సభ్యులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వారికి అవసరమైన ఆహారం, పారిశుధ్యం, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అతి తక్కువ ఆస్తి నష్టం, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. తుపాన్ వల్ల 24 రోడ్లపై నీటి ప్రవాహం రావడం వల్ల రాకపోకలు నిలిపి వేశామని పేర్కొన్నారు.


