News March 27, 2024
క్రోసూరు: గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని చిలకా చిన్నారి (15) మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. క్రోసూరు మండలం నాగవరాని చెందిన విద్యార్థిని స్థానిక హైస్కూల్‌లో చదువుతూ బృగుబండలో పది పరీక్షలు రాస్తోంది. బుధవారం సైన్సు పరీక్షకు హాజరై ఇంటికి రాగానే అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం సత్తెనపల్లి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో చనిపోయింది. విద్యార్థినికి కొన్నాళ్లుగా గుండె సమస్య ఉన్నట్లు సమాచారం.
Similar News
News September 29, 2025
తెనాలిలో వింత.. శ్మశాన వాటికలో డమ్మీ సమాధి!

తెనాలి ఐతానగర్ శ్మశాన వాటికలో ఎటువంటి మృతదేహం లేకుండా కొన్నేళ్లుగా డమ్మీ సమాధి నిర్మించారని ఇదే ప్రాంతానికి చెందిన గడ్డేటి ప్రకాష్ బాబు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం సీఐ రాములు నాయక్‌ను కలిసి 2015లో డమ్మీ సమాధిని నిర్మించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు. సమాధిని ముందుగానే నిర్మించి స్థలాన్ని కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంసమైంది.
News September 29, 2025
మహానటి సావిత్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: జయసుధ

మహానటి సావిత్రి ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారని సినీ నటి జయసుధ అన్నారు. ఆదివారం గుంటూరు వచ్చిన సందర్భంగా కళా దర్బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సావిత్రి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సావిత్రి నటన విశిష్టమైందని, ఆమె స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. సావిత్రి విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.
News September 28, 2025