News April 14, 2025
NRPT: ‘అంబేడ్కర్ మహానుభావుడు’

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ ఛైర్మన్ సీత దయాకర్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం అంబేడ్కర్ జయంతి పురస్కరించుకొని నారాయణపేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ముందుచూపుతో దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు.
Similar News
News April 18, 2025
మల్లన్న సేవలో సంగీత దర్శకుడు మణిశర్మ

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సినీ సంగీత దర్శకుడు మణిశర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. సమరసింహారెడ్డి, అన్నయ్య, ఖుషి, ఆది, ఇంద్ర, అతడు, నారప్ప, ఆచార్య వంటి ఎన్నో చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించారు.
News April 18, 2025
జేఈఈ మెయిన్ ‘కీ’ విడుదల

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫైనల్ ‘కీ’ని ఎట్టకేలకు NTA విడుదల చేసింది. <
News April 18, 2025
MMTSలో అత్యాచారయత్నం కేసు.. బిగ్ ట్విస్ట్

కొద్దిరోజుల క్రితం HYD MMTSలో అత్యాచారయత్నం సందర్భంగా యువతి రైలు నుంచి కిందకి <<15866506>>దూకేసిన<<>> ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్‌స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయం చెబితే అంతా తిడతారని భయపడి ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందకి దూకేసినట్లు చెప్పింది. తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు.