News April 14, 2025
కోటవురట్ల: మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

కోటవురట్ల మండలం కైలాసపట్నం మందుగుండు తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మృతులకు ఆదివారం రాత్రి పోస్టుమార్టం పూర్తయింది. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆరు మృతదేహాలకు, పోస్టుమార్టం నిర్వహించగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తొందరగా ముగించారు.
Similar News
News November 9, 2025
VJA: దుర్గగుడిలో దసరాను తలపించిన కార్తీక రద్దీ

ఇంద్రకీలాద్రిపై కార్తీక ఆదివారం సందర్భంగా దసరా ఉత్సవాన్ని తలపించేలా భక్తుల రద్దీ కిక్కిరిసింది. వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు ఈ రద్దీ కొనసాగింది. ఈవో శ్రీనా నాయక్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ, సీసీ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు గమనించారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూశారు.
News November 9, 2025
ఆడపిల్ల పెళ్లికి రూ.65వేల సాయం: యోగి

యూపీలో భవన నిర్మాణ కార్మికులకు యోగి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘కన్యా వివాహ్ సహాయతా యోజన’ కింద ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేయనుంది. సాధారణ వివాహానికి రూ.65వేలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీకి రూ.75వేలు, సామూహిక వివాహాలకు రూ.85వేలు ఇవ్వనుంది. వీటితో పాటు వేడుక ఖర్చులకు రూ.15వేలు అదనంగా అందించనుంది. భవన నిర్మాణ కార్మికులు సమాజానికి వెన్నెముక అని యోగి కొనియాడారు.
News November 9, 2025
జూబ్లీహిల్స్ పోటీలో నలుగురు మహిళా అభ్యర్థులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో నలుగురు మహిళలు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో పాటు సోషలిస్ట్ పార్టీ నుంచి సుభద్రారెడ్డి, ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇంక్విలాబ్-ఏ-మిల్లత్ నుంచి షేక్ రఫత్ జహాన్, స్వతంత్ర అభ్యర్థి అస్మా బేగం పోటీ చేస్తున్నారు. నలుగురు అభ్యర్థుల్లో అస్మాబేగం పిన్న వయస్కురాలు.


