News April 14, 2025
జగిత్యాల: అంబేడ్కర్‌కు ఘన నివాళులు

భారతరత్న డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తహసిల్ చౌరస్తాలో విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్, అదనపు కలెక్టర్ లత, సంఘ సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 18, 2025
నెల్లూరు కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నందన్

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ బదిలీ అయిన విషయం తెలిసిందే. నూతన కమిషనర్‌గా ఇంకా ఎవరిని నియమించలేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ అదనపు కమిషనర్ నందన్‌ను ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News April 18, 2025
UPI పేమెంట్స్‌పై GST.. క్లారిటీ

రూ.2వేలకు పైన చేసే UPI పేమెంట్స్‌పై కేంద్రం 18% GST విధించనున్నట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలపై కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. అవన్నీ నిరాధార, తప్పుదోవ పట్టించే వార్తలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమీ లేవని స్పష్టం చేసింది.
News April 18, 2025
కాటారం: వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

ఆదివారంపేట వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు. కొన్ని రోజుల క్రితం మృతురాలు మల్లక్క(67) కోడలు శ్రీలతతో నిందితుడు శివ(42)కు పరిచయమైంది. కాగజ్‌నగర్‌లో ఇద్దరు 3 నెలలు సహజీవనం చేశారు. శివ వేధింపులు తాళలేక శ్రీలత ఆదివారంపేటకు వచ్చింది. శ్రీలతను కలవాలని శివ చూడగా నిరాకరించింది. మల్లక్కను చంపితే కేసు శ్రీలత మీదకే వస్తుందని భావించి హత్య చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు.