News April 14, 2025

ఎండపల్లి: అంబేడ్కర్ వేషధారణలో బాలుడు

image

ఎండపల్లి మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుడు తునికి శ్రీ కీర్తన్ అంబేడ్కర్ వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడకి అంబేడ్కర్ గొప్పదనం గురించి తమ గురువులు చెప్పారని అన్నారు. అంబేడ్కర్ అంటే తనకు ఇష్టమని తెలిపారు.

Similar News

News December 26, 2025

రెడ్ కలర్ చూస్తే ఎద్దులు దాడి చేస్తాయా! నిజమేంటి?

image

రెడ్ కలర్ ఎద్దులకు నచ్చదని, దాడి చేస్తాయనేది అపోహ మాత్రమే. చాలా పశువుల్లాగే ఎద్దులకు కూడా రెడ్ కలర్‌ను గుర్తించే రెటీనా సెల్స్ ఉండవు. ఎద్దులు డైక్రోమాట్స్ (2కలర్ రిసెప్టర్లు) కావడంతో ఎల్లో, బ్లూ, గ్రీన్, వయొలెట్ రంగులను గుర్తించగలవు. వాటికి ఎరుపు రంగు గ్రేయిష్-బ్రౌన్ లేదా ఎల్లోయిష్-గ్రేలా కనిపిస్తుంది. వేగమైన కదలికల కారణంగా దాడికి దిగుతాయి. తెలుపు, నీలం రంగు క్లాత్స్ కదిలించినా దాడి చేస్తాయి.

News December 26, 2025

GHMC: కొత్త జోనల్ కమిషనర్లు వీళ్లే

image

*శేరిలింగంపల్లి: భోర్ఖడే హేమంత్ సహదేవ్‌రావు
* కూకట్‌పల్లి: అపూర్వ్ చౌహాన్
* కుత్బుల్లాపూర్: సందీప్ కుమార్ ఝా
* చార్మినార్: ఎస్. శ్రీనివాస్ రెడ్డి
* గోల్కొండ: జి. ముకుంద రెడ్డి
* ఖైరతాబాద్: ప్రియాంక అలా
* రాజేంద్రనగర్: అనురాగ్ జయంతి
* సికింద్రాబాద్: ఎన్. రవి కిరణ్
* శంషాబాద్: కె. చంద్రకళ
* ఎల్.బి.నగర్: హేమంత కేశవ్ పాటిల్
* మల్కాజ్‌గిరి: సంచిత్ గంగ్వార్
* ఉప్పల్: రాధికా గుప్తా

News December 26, 2025

డిసెంబర్ 26: చరిత్రలో ఈరోజు

image

✒ 1899: స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దమ్ సింగ్ జననం
✒ 1893: చైనాలో ప్రముఖ కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్ జననం
✒ 1946: దర్శకుడు బి.నరసింగరావు జననం
✒ 1981: మహానటి సావిత్రి మరణం(ఫొటోలో)
✒ 1988: కాపు నేత వంగవీటి మోహనరంగా మరణం
✒ 2004: పలు దేశాల్లో విధ్వంసం సృష్టించిన సునామీ. దాదాపు 2,75,000 మంది మృతి