News April 14, 2025
పెద్దపల్లి: హక్కుల రక్షణలో అంబేడ్కర్ కీలక పాత్ర: వివేక్

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి బస్టాండ్ ప్రాంతంలోని అంబేడ్కర్ విగ్రహానికి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం దేశ ప్రజల హక్కులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయాలను యువత పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
Similar News
News March 14, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 91% మంది విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ సివిక్స్ పేపర్-1 పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 91% మంది విద్యార్థులు హాజరయ్యారు. నేడు 3,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 3,397 మంది మాత్రమే హాజరయ్యారు. 326 మంది విద్యార్థులు పరీక్షలకు డుమ్మా కొట్టారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ అధికారులు తెలిపారు.
News March 14, 2026
FLASH.. కేయూ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి మృతి

కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి ఈరోజు మధ్యాహ్నం 12:20 గం.కు మృతి చెందారు. ఆయనకు భార్య అంజలి, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. గత ఆరు మాసాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు నెలలుగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం క్షీణించడంతో వారం రోజుల క్రితం ఆయన నివాసానికి తీసుకురాగా ఈరోజు తుది శ్వాస విడిచారు.
News March 14, 2026
పెద్దపల్లి: యువతకు మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ప్రారంభం

పెద్దపల్లి జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెడికల్ కోడింగ్ & బిల్లింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈ శిక్షణ మార్చి 16 నుంచి పెద్దపల్లి TASK రీజినల్ సెంటర్‌లో ప్రారంభం కానుందని, ఫార్మసీ, బయోటెక్నాలజీ విద్యార్థులు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


