News April 14, 2025

అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: ఆసిఫాబాద్ ఎస్పీ

image

అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అన్నారు. ఆసిఫాబాద్ పోలీస్ కార్యాలయంలో జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కోసం, ప్రజలు హక్కుల కోసం అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.

Similar News

News March 17, 2026

GOOD NEWS: ఇకపై కొత్త ఇల్లు కట్టుకుంటే రూ.2.39 లక్షలు

image

AP: గ్రామాల్లో ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. PMAY-రూరల్ 2.O స్కీమ్ కింద మంజూరు చేసే ఇళ్ల ధరను ₹1.20 లక్షల నుంచి ₹2.39 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఇందులో కేంద్ర వాటా ₹72వేలు, రాష్ట్ర వాటా ₹48 వేలు ఉంటుంది. అదనంగా జీ రామ్ జీ కింద 90 పని దినాలకు కన్వర్జెన్స్ రూపంలో ₹27వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద ₹12వేలు, SHG లోన్‌పై వడ్డీ రాయితీ ₹80వేలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.

News March 17, 2026

నల్గొండ: ఉరుములు, మెరుపులతో వర్షాలు..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 8 మైళ్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున, రైతులు తమ పంట ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News March 17, 2026

పులివెందుల: కొండంతో దు:ఖంలోనూ..

image

పదవ తరగతి పరీక్ష రాసిన అనంతరం తండ్రి అంత్యక్రియల్లో విద్యార్థిని పాల్గొన్న ఘటన పులివెందులలో చోటు చేసుకుంది. సోమవారం బయమ్మ తోటలో ఉన్న దండు శివయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె ధరణి 10వ తరగతి చదువుతోంది. ఉదయం పదవ తరగతి పరీక్ష ఉండగా.. అదే సమయంలో తండ్రి మృతి చెందాడు. ఈ బాధను దిగమింగుకొని విద్యార్థిన పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసింది.