News April 14, 2025

పెద్దపల్లి: యువ వికాసం పథకానికి 34 వేల దరఖాస్తులు

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి పెద్దపల్లి జిల్లాలో 34 వేల దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు సోమవారం తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయంతో పాటు శిక్షణ కల్పించేందుకు రూపొందించిన ఈ పథకంపై యువతలో భారీ స్పందన కనిపిస్తోంది. ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News March 19, 2026

ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ నిజం కాదా?

image

ఇరాన్ 2 వారాల్లోనే న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే అవకాశం ఉన్నందునే Feb 28న దాడులు చేశామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే US మాజీ కౌంటర్ టెర్రరిజం చీఫ్ కెంట్ ఈ వాదనను కొట్టిపారేశారు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారీని నిషేధిస్తూ గతంలో జారీ చేసిన ‘ఫత్వా’ను ఉల్లంఘించినట్లు ఎటువంటి ఆధారాలు లేదన్నారు. ఖమేనీ హత్య ఇరాన్‌ను మరింత రెచ్చగొట్టిందని, ఈ దాడుల వల్ల శాంతి నెలకొనే అవకాశం లేదని పేర్కొన్నారు.

News March 19, 2026

అమలాపురం: కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

image

అమలాపురం కలెక్టరేట్‌లో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలకు నాంది పలుకుతుందని సమగ్ర శిక్ష ఏపీసీ, ఆర్డీవో జి మమ్మీ పేర్కొన్నారు. వేద పఠనం, పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులను అధికారులు అధికారికంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

News March 19, 2026

సహజీవన జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. గుజరాత్‌లో UCC బిల్

image

గుజరాత్ ప్రభుత్వం అసెంబ్లీలో UCC(యూనిఫామ్ సివిల్ కోడ్) బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సహజీవనంలో ఉండే జంటలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెలలోగా ఇలా చేయకపోతే 3M జైలు శిక్ష/₹10K ఫైన్, ఒక్కోసారి రెండూ విధిస్తారు. బలవంతం/మోసపూరితంగా వ్యవహరిస్తే ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మత ఆధారిత చట్టాల స్థానంలో పెళ్లి, విడాకులు, భరణం, వారసత్వం, దత్తత విషయంలో పౌరులందరికీ ఒకే రూల్స్ వర్తిస్తాయి.