News April 14, 2025

అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: కర్నూలు కలెక్టర్

image

వెల్దుర్తి బాలుర వసతి గృహంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.  దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎమ్మార్వో, ఆర్డీవో, వార్డెన్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 21, 2025

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ ద్వారా 2,645 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.

➤ OC-1057 ➤ BC-A:187 ➤ BC-B:259
➤ BC-C:27 ➤ BC-D:186 ➤ BC-E:99
➤ SC- గ్రేడ్1:35 ➤ SC-గ్రేడ్2:173
➤ SC-గ్రేడ్3:204 ➤ ST:161 ➤ EWS:257.
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16156783>>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

News April 21, 2025

DSC: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,645 పోస్టులు.. పోటీ వేలల్లో.!

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ పోస్టులకు పోటీ నెలకొంది. జిల్లాకు 2,645 పోస్టులు మంజూరయ్యాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 30వేల మందికిపైగా అభ్యర్థులు డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఎస్జీటీ పోస్టులు రాష్ర్టంలోనే అధికంగా కర్నూలు జిల్లాలో 1,817 ఉండటంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 21, 2025

కర్నూలు: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

image

కర్నూలు జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితితంటూ ప్రైవేటు టీచర్లు వాపోతున్నారు.

error: Content is protected !!