News April 14, 2025
GWL: బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్: SP

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి కుల వ్యవస్థను ఎదుర్కొంటూ ఉన్నత విద్యను అభ్యసించి, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా ఎదిగాడని ప్రశంసించారు.
Similar News
News March 19, 2026
MBNR: ఉగాది సుఖ సంతోషాలు నింపాలి: SP

తెలుగు నూతన సంవత్సర ఉగాది(పరాభవ నామ సంవత్సర) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ జానకి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో మొదలయ్యే ఈ తెలుగు నూతన సంవత్సరం, ప్రజలందరి జీవితాలలో శాంతి, సుఖ సంతోషాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉగాది తెలుగు ప్రజలకు నూతన సంవత్సర ఆరంభమని పేర్కొంటూ, పోలీస్ సిబ్బంది, మీడియా, జిల్లా ప్రజలకు ఆరోగ్యం, ఆనందం కలగాలని ఎస్పీ జానకి పేర్కొన్నారు.
News March 19, 2026
విద్యార్థుల చేతిరాతపై ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు!

AP: విద్యార్థుల చేతిరాత బాగాలేదనే కారణంతో మార్కులు తగ్గించవద్దని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. సమాధానాల ఆధారంగానే మూల్యాంకనం చేయాలని జూ.లెక్చరర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ‘పూర్తిగా చదవకుండానే మార్కులు ఇవ్వొద్దు. ఆన్సర్స్ సరిగ్గా ఉంటే చేతిరాత కారణంగా మార్కులు తగ్గించవద్దు’ అని సూచించింది. పొరపాట్లు వస్తే ₹3వేలు-7500 వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించింది. ఈ నెల 21 నుంచి మూల్యాంకనం మొదలు కానుంది.
News March 19, 2026
నేడే సింహాచలం అప్పన్న పెళ్లిరాట మహోత్సవం

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈనెల 29న జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారికి ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు పెళ్లి రాట మహోత్సవం నిర్వహించనున్నారు. సంప్రదాయబద్ధంగా వైదిక క్రతువులు పూర్తిచేసి భక్తుల గోవింద నామస్మరణ, మేళతాళాల మధ్య రాట ఉడుపు మహోత్సవాన్ని నిర్వహిస్తారు. నేటి నుంచి స్వామి అమ్మవార్ల పెళ్లి పనులు ప్రారంభమవుతాయి.


