News April 14, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహన యజమాని మాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బీదర్ నుంచి తిరుపతికి బేరం కుదుర్చుకుని వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో 12 మందికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Similar News
News October 31, 2025
కోనరావుపేట: ‘రైస్ మిల్లుల్లో ధాన్యం అన్‌లోడ్ చేసుకోవాలి’

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో వెంటనే అన్‌లోడ్ చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. కోనరావుపేట మండలం మల్కపేటలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వడ్ల కుప్పలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. నిర్వాహకులు రైతులకు అందుబాటులో ఉండి, అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు.
News October 31, 2025
PHOTO OF THE DAY: దూరదర్శినితో DGP, CP

బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను గురువారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. డేటా సెంటర్, స్టేట్ కాన్ఫరెన్స్ హాల్, సీపీ కార్యాలయం, హెలిప్యాడ్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. CP సజ్జనార్‌తో కలిసి దూరదర్శిని సాయంతో నగరాన్ని వీక్షించారు. వీరి వెంట ICCC డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉన్నారు.
News October 31, 2025
వర్డ్ ఆఫ్ ది ఇయర్ తెలుసా?

ఈ ఏడాదికి ‘67’ను వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రముఖ ఆన్‌లైన్ డిక్షనరీ వెబ్‌సైట్ డిక్షనరీ.కామ్ ప్రకటించింది. నంబర్‌ను పదంగా పేర్కొనడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి అర్థం లేదని, నిర్వచించలేమని వెబ్‌సైట్ స్పష్టం చేసింది. అమెరికన్ ర్యాపర్ స్క్రిల్లా డ్రిల్ <


