News April 14, 2025

BREAKING.. కుషాయిగూడలో మర్డర్

image

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 5, 2026

మహిళా ఆఫీసర్లకు మంత్రి వేధింపులు: BRS

image

TG: రాష్ట్ర మంత్రి ఒకరు మహిళా ఆఫీసర్లను వేధిస్తున్నారని BRS ఆరోపించింది. “ఎవరా అమాత్యుడు? కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా అధికారులకు రక్షణ ఎక్కడ? ఒక మంత్రి స్థాయి వ్యక్తి మహిళా అధికారులను వేధింపులకు గురిచేస్తుంటే రేవంత్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇదేనా మీరు గొప్పగా చెప్పుకునే ‘ఇందిరమ్మ రాజ్యం’? వెంటనే సదరు మంత్రిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి” అని డిమాండ్ చేస్తూ ఓ <>వీడియోను<<>> Xలో షేర్ చేసింది.

News January 5, 2026

ఇంటర్వ్యూతో ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

ఆయిల్ ఇండియా లిమిటెడ్(OIL) 8 కెమిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. MSc (కెమిస్ట్రీ) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 7న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వయసు 18 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.70,000 చెల్లిస్తారు. మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.oil-india.com

News January 5, 2026

WGL: 7 సార్లు హెలికాప్టర్.. కోటిపైనే ఖర్చు..!

image

సమ్మక్క మాల వేసుకొని మేడారంలోనే తిష్ఠ వేయాలని CMరేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మంత్రులు పెడచెవిన పెట్టారు.గాలి మోటార్లలో చక్కర్లు కొట్టడం మినహా, పెద్దగా జాతరలో చేసింది ఏమీ లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే 7సార్లు హెలికాప్టర్లలో మేడారానికి రావడం ద్వారా రూ.కోటిపైనే ప్రభుత్వానికి భారం మిగిలిందే తప్ప, మేడారానికి ప్రయోజనం ఏమీలేదని, సమ్మక్క దీక్ష చేపట్టి,ఇక్కడే ఉంటే పనులు వేగంగా అయ్యేవంటున్నారు.