News April 14, 2025
అంబేడ్కర్ ఆశయాల బాటలో అడుగేద్దాం: కలెక్టర్

అంబేడ్కర్ ఆశయాల బాటలో అడుగేద్దామని, ఆయన స్ఫూర్తితో చిన్నారులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, దేశాభివృద్ధికి అయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
Similar News
News November 8, 2025
‘శుక్ల పక్షం’ అంటే ఏంటి?

ప్రతి నెలా అమావాస్య తర్వాత, పౌర్ణమి వరకు ఉండే 15 రోజుల కాలాన్ని శుక్ల పక్షంగా వ్యవహరిస్తారు. ఈ పక్షంలో చంద్రుని కళలు క్రమంగా పెరుగుతుంటాయి. రోజురోజుకూ వెన్నెల పెరుగుతుంది. చంద్రుడు ప్రకాశవంతమయ్యే స్థితిలోకి వెళ్లడం వల్ల దీనిని వృద్ధి చంద్ర పక్షం/ తెలుపు పక్షం అని కూడా అంటారు. శుక్ల అంటే తెలుపును సూచిస్తుంది. దాని ఆధారంగా శుక్ల పక్షం అనే పేరు వచ్చింది. దీన్నే శుద్ధ పక్షం అని కూడా పిలుస్తారు.
News November 8, 2025
CWCలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(CWC)లో 22 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎగ్జామ్‌కు 21 రోజుల ముందు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://cwceportal.com/
News November 8, 2025
ఈనెల 16న కొత్తగూడెంలో జాబ్ మేళా

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న తలపెట్టిన జాబ్ మేళాను 16వ తేదీకి మార్చబడిందని నిర్వాహకులు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ పక్కనగల కొత్తగూడెం క్లబ్లో మేళా ఉంటుందని చెప్పారు. పది నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులని చెప్పారు. 65+ కంపెనీల్లో 3,500 ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నారు. ట్రాన్స్ జెండర్, చెవిటి, మూగ, దివ్యాంగులకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఉ.9 నుంచి సా.5 గంటల వరకు హాజరవ్వాలన్నారు.


