News March 27, 2024
చంద్రబాబు భయపడ్డాడు: చిత్తూరు ఎంపీ

చంద్రబాబు కుప్పం పర్యటనపై చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్పందించారు. ‘భయం అంటే ఏంటో తెలుసా? చంద్రబాబు కుప్పంలో ఒక్కరోజూ ప్రచారం చేయకుండా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ ఇప్పుడు ఇంటింటికీ తిరుగుతున్నాడు. కారణం కుప్పంలో జగన్ గారు చేసిన అభివృద్ధి. కుప్పం ప్రజలు ఈసారి వైసీపీకి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు అనే నిజానికి చంద్రబాబు భయపడ్డాడు’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News September 29, 2025
అక్రమ కేసులు పెడుతున్న వారికి తిప్పలు తప్పవు: రోజా

YCP శ్రేణులపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేస్తున్న వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రి రోజా హెచ్చరించారు. ఆదివారం ఆమె డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. అనతరం మాట్లాడుతూ.. YCP శ్రేణులపై దాడులే లక్ష్యంగా నిరంకుశ పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు తమ వివరాలను డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని, అధికారంలోకి వచ్చాక చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
News September 29, 2025
చిత్తూరు: ‘నేడు కలెక్టరేట్‌లో గ్రివెన్స్ డే’

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News September 28, 2025
చిత్తూరు: ‘రేపు కలెక్టరేట్‌లో గ్రివెన్స్ డే’

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.