News April 14, 2025
మచిలీపట్నం: అంబేడ్కర్‌కు నివాళులర్పించిన కొల్లు

మచిలీపట్నంలో సోమవారం అంబేడ్కర్ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధరరావు, నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణ, తదితరులు లక్ష్మీటాకీస్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Similar News
News April 16, 2025
గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న 16వ ఆర్థిక సంఘం

గన్నవరం విమానాశ్రయానికి పనగారియ నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం చేరుకుంది. రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈ బృందం పర్యటిస్తుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం వంటి కీలకమైన అంశాలపై ఫైనాన్స్ కమిషన్ టీమ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల భేటీ కానున్నారు.
News April 16, 2025
కృష్ణా: అంతరించిపోతున్న ఈత బుట్టలు.!

ఓ కాలంలో ప్రతిష్ఠగా నిలిచిన ఈత బుట్టలు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు, సుంకొల్లు, పామర్రు, గన్నవరం, బాపులపాడు తదితర ప్రాంతాల్లో తయారయ్యేవి. ఈత చెట్ల చువ్వలు కోసి, వాటిని చేతితో నేసి అందంగా తయారు చేసేవారు. పట్టణాల్లోకి వెళ్లి అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. ప్లాస్టిక్ వస్తువులు వచ్చాక ఈ కళ జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది.
News April 16, 2025
గుడివాడ: తమ్ముడి మృతిని తట్టుకోలేక అక్క మృతి

సోదరుడి మృతదేహాన్ని చూసేందుకు విజయవాడ వెళ్లిన మృతుడి సోదరి అంజలి షాక్‌కు గురై చనిపోయిన ఘటన మంగళవారం చోటు చేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. గుడివాడ రూరల్ మండలం దొండపాడుకు చెందిన మాజీ సర్పంచ్ రామాంజనేయులు అనారోగ్యంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. ఈయన భార్య గద్దె పుష్పరాణి ప్రస్తుతం గుడివాడ రూరల్ మండల ఎంపీపీగా ఉన్నారు. తమ్ముడి మృతితో అక్క మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.