News April 14, 2025

విశాఖ: ప్రేమ వివాహం.. భార్యను హత్య చేసిన భర్త

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితంలో అనుమానం పెరిగి భార్యను హత్య చేశాడు. అడ్డరోడ్డుకు చెందిన అనూష, దువ్వాడకు చెందిన జ్ఞానేశ్వర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ మధురవాడలో నివాసం ఉంటున్నారు. జ్ఞానేశ్వర్ మరొక అమ్మాయితో సంబంధం ఉన్నదని ఇద్దరి మధ్య గొడవ అయింది. దీంతో భర్త ఎనిమిది నెలల గర్భిణీ గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో మృతి చెందింది. మృతురాలిని కెజిహెచ్ హాస్పిటల్‌కి తరలించారు.

Similar News

News April 16, 2025

భీమిలి: కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

image

విశాఖలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. షిప్పింగ్ యార్డ్ ప్రాంతానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలోని ఓ కాలేజీ ఎదురుగా ఉన్న షాపులో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డుపడి భీమిలి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం KGHకి తరలించారు. మహిళ స్టేషన్ ఏసీపీ పెంటా రావు సంఘటన స్థలాన్ని బుధవారం పరిశీలించారు.

News April 16, 2025

విశాఖ: దివీస్ ఉద్యోగి మృతి

image

దివీస్‌లో పనిచేస్తున్న మధు మోహాన్ మంగళవారం మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన మోహన్ దివీస్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కి వచ్చాడు. అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 16, 2025

కైలాసపట్నం: క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం

image

కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న జల్లూరి నాగరాజు, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకల జానకిరామ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని వారి బంధువులు మంగళవారం తెలిపారు. వి.సంతోషి, వి షారోని, వి.రాజును త్వరలో డిశ్చార్జ్ చేయనున్నారు.

error: Content is protected !!