News April 14, 2025

అచ్చంపేట: నల్లమలలోని ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు

image

నల్లమల ప్రాంతంలోని దేవాలయాలకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. భక్తుల సంఖ్య, ఆదాయం పెరగడంతో మద్దిమడుగు ఉమామహేశ్వరం, సోమశిల, నాయనపల్లి మైసమ్మ, 6ఏ జాబితాలో చేర్చుతూ హోదా పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, పాలెం వెంకటేశ్వర దేవాలయానికి 6బీ జాబితాలో చేర్చారు.

Similar News

News July 9, 2025

వరంగల్ నిట్‌లో తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం

image

వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్‌)లో రాష్ట్రంలోనే తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం నిర్వహించారు. బుధవారం నిట్ ఆడిటోరియంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ‘ఎంపవరింగ్ రీసెర్చ్ త్రూ షేర్డ్ సైన్టిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అనే థీమ్‌తో సమావేశం నిర్వహించారు. అన్ని రంగాలకు సాంకేతికతను అందించడమే ఐ స్టెమ్ లక్ష్యం అని వక్తలు పేర్కొన్నారు.

News July 9, 2025

కొంపల్లి రెస్టారెంట్‌ కేంద్రంగా డ్రగ్ దందా

image

HYDలో డ్రగ్స్ మాఫియా గట్టును మరోసారి ఈగల్ టీమ్‌ బట్టబయలు చేసింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్‌ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ రాకెట్‌ను నడుపుతున్న ముఠాను పట్టుకుంది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో ఈ దందా సాగుతోందని పోలీసులు తెలిపారు. సూర్య 23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు.

News July 9, 2025

పెద్దపల్లి: గానుగ వృత్తి పరిరక్షణకు ప్రభుత్వం కృషి: మంత్రి

image

తెలంగాణ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్‌ను గానుగ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డా.లెక్కల నాగేశ్ ఈరోజు పెద్దపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. గానుగ వృత్తి పరిరక్షణ, గాండ్ల యువతకు నైపుణ్య శిక్షణ, సబ్సిడీతో గానుగలు, గాండ్ల కార్పొరేషన్ ఏర్పాటుపై వినతిపత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ కుల వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.