News April 14, 2025

అందువలనే భారీ ప్రాణ నష్టం: ఐజీ

image

మెటీరియల్ ఎక్కువగా ఉండడంతో పాటు బాణసంచా తయారు చేసే షెడ్లు పక్కపక్కనే ఉండడం వల్లే భారీ ప్రాణ నష్టం జరిగిందని అగ్నిమాపక శాఖ ఐజీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. సోమవారం కైలాసపట్నంలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఉమ్మడి విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో బాణసంచా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తయారీ కేంద్రాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Similar News

News April 16, 2025

తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్‌గా హుస్సేన్ సాహెబ్

image

రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు గంగ‌ స్పెషల్‌ కలెక్టర్‌గా హుస్సేన్ సాహెబ్ నియమితులయ్యారు. ఆయన గతంలో నెల్లూరు ఆర్డీవోగా పనిచేశారు. బదిలీపై వెళ్లినప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. వెయిటింగ్‌లో ఉన్న ఆయనను తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News April 16, 2025

గుడివాడ: తమ్ముడి మృతిని తట్టుకోలేక అక్క మృతి

image

సోదరుడి మృతదేహాన్ని చూసేందుకు విజయవాడ వెళ్లిన మృతుడి సోదరి అంజలి షాక్‌కు గురై చనిపోయిన ఘటన మంగళవారం చోటు చేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. గుడివాడ రూరల్ మండలం దొండపాడుకు చెందిన మాజీ సర్పంచ్ రామాంజనేయులు అనారోగ్యంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. ఈయన భార్య గద్దె పుష్పరాణి ప్రస్తుతం గుడివాడ రూరల్ మండల ఎంపీపీగా ఉన్నారు. తమ్ముడి మృతితో అక్క మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 16, 2025

అనకాపల్లి: వచ్చెనెల ఒకటో తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ

image

అనకాపల్లి జిల్లాలో మే1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విద్యార్థులకు వేసవి క్రీడా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రమణ మంగళవారం తెలిపారు. 8 నుంచి 14 సంవత్సరాల వయసు గల విద్యార్థులు శిక్షణ శిబిరంలో పాల్గొనవచ్చునన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 17వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

error: Content is protected !!